Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ పదేళ్లు సందర్భంగా దచ్చన్న దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ

Advertiesment
dachanna darilo tyagala song

డీవీ

, బుధవారం, 29 మే 2024 (16:00 IST)
dachanna darilo tyagala song
నేర్నాల క్రియేషన్స్ బ్యానర్‌లో తెలంగాణను సాధించుకుని పదేళ్లు కావొస్తున్న సందర్భంగా దచ్చన్న దారిలో త్యాగాల పాటల చిత్రీకరణ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల త్యాగాలను స్మరించుకునేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు కాన్సెప్ట్, రచన, గానం, దర్శకత్వం నేర్నాల కిషోర్ వహించారు.ఈ పాటలో 200 మందికి పైగా కళాకారులు నటించారు.ఈ పాట చిత్రీకరణ కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కొత్తగట్టు, మొలంగూర్ గుట్టలపై చేశారు. 
 
webdunia
dachanna darilo tyagala song
తెలంగాణ స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల ఆశయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ పాట ప్రత్యేక పాత్రలో ప్రజా యుద్ధనౌక గద్దర్ వేషధారణలో ఏ.డీ.ఎం.ఎస్ శివాజీ ఆకట్టుకున్నారు. ఈ పాటను తెలంగాణ అమరుల కుటుంబాలకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పాటను ప్రతీ ఒక్కరూ ఆదరించాలని నేర్నాల కిషోర్ కోరారు. ఈ పాటను తెలంగాణ అమరుల కుటుంబాల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
 
ఈ కార్యక్రమానికి అతిధులుగా  MLC మహేష్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ, సినీ దర్శకులు ఎన్ శంకర్, హీరో సంజోష్,  అరుణోదయ విమలక్క, విమల గద్దర్ (వెన్నెల) పాల్గొన్నారు. ఈ పాటకు కోరియోగ్రఫీ, డి.ఓ.పి శాంతిరాజ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార‌తీయుడు 2 నుంచి ల‌వ్ మెలోడీ సాంగ్ చెంగల్వ.. రిలీజ్