Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖామంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్!?

kodandaram

వరుణ్

, ఆదివారం, 28 జనవరి 2024 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరినీ అక్కున చేర్చుకుంటున్నారు. ఏదో రూపంలో పదవి కట్టబెడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఇపుడు ఎమ్మెల్సీ చేశారు. ఆ తర్వాత ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకుని విద్యా మంత్రిత్వ శాఖను కేటాయించాలన్న తలంపుతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే గవర్నర్ కోటాలో కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అలాగే, తన మంత్రివర్గాన్ని బడ్జెట్ సమావేశాలకు ముందుగానే విస్తరించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం ఈ నెలాఖరులోనే అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసి అధిష్టానం నిర్ణయం కోసం పంపనున్నట్టు తెలుస్తుమంది. 
 
మంత్రివర్గంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 12 మంది మాత్రమే ఉన్నారు. విస్తరణలో మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భేషరతుగా మద్దతు ప్రకటించిన కోదండరామ్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేసిన కాంగ్రెస్ ఇపుడు మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
కాలేజీ హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రసవం... 
 
ఏపీలోని నంద్యాల జిల్లాలో పాణ్యం మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాలేజీ హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా అక్కడ ప్రాణాలు కోల్పోయింది. మూడు నెలల క్రితమే ఈ కాలేజీలో చేరిన విద్యార్థినిని గర్భిణిగా ఉన్నప్పటికీ తోటి విద్యార్థులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఆ విద్యార్థిని ప్రసవించేవరకు తోటి విద్యార్థులకు తెలియకపోవడం గమనార్హం. 
 
శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థిని కాలేజీకి రావాలని కోరింది. రాత్రి 9 గంటలకు సమయంలో హాస్టల్ బాత్రూమ్‌‍లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన యువతిని కాలేజీ యాజమాన్యం సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీ హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రసవం...