Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి - 23 మంది చిన్నారుల మృతి

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:13 IST)
తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 23 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఓ విద్యా సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దీంతో 23 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు విద్యార్థినులే ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు. 
 
ఈ బాంబు దాడి వెస్ట్ కాబూల్ దాష్త్ ఏ బర్చీ అనే ఏరియాలోని కాజ్ ఎడ్యుకేషనల్ సెంటరులో భారీ విస్పోటనంతో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. 
 
ఈ పేలుడు ధాటికి చనిపోయిన వారిలో అత్యధికులు మైనారిటీకి చెందిన హజారాకు తెగకు చెందిన వారిగా గుర్తించారు. ఆప్ఘనిస్థాన్‌లో హాజారాలు(షియా తెగ ప్రజలు) మైనార్టీలుగా పరిగణిస్తారు. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వీరిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడులు జరుగుతున్నాయి. 
 
అయితే, తాజాగా జరిగిన బాంబు దాడికి ఏ సంస్థా కూడా నైతిక బాధ్యత వహించలేదు. దాడి జరిగిన సమయంలో విద్యా సంస్థలో దాదాపు 500 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments