ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. కాబూల్ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో కనీసం 20మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి.
బుధవారం సాయంత్రం ఆప్ఘన్ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఏడేళ్ల చిన్నారి సహా 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తాలిబన్లు ఇటీవలే సంబరాలు చేసుకున్నారు. అంతలోనే మసీదుపై దాడులు జరగడం గమనార్హం. ఈ పేలుడిపై ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.