Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో కొత్త వైరస్ 35 మందికి సోకింది..

Advertiesment
Langya Henipa
కరోనా వైరస్ వ్యాప్తితో చైనా అతలాకుతలం అయింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. చైనా దేశంలో జూనోటిక్ లాంగ్యా వైరస్ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 
 
కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనీయులు ప్రస్తుతం కొత్తగా వెలుగులోకి వచ్చిన వైరస్‌తో ఇంకెన్ని ఇబ్బందులు పడాలోనని ఆందోళణ చెందుతున్నారు.
 
అయితే ఈ కొత్త వైరస్ 35 మందికి సోకింది. తైవాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. జూనోటిక్ లాంగ్యా అనే ఈ వైరస్ చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సులలో కనుగొనబడింది. 
 
తైవాన్‌లో ఈ వైరస్‌ను పర్యవేక్షించడానికి, గుర్తించడానికి కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారని, దీనికి న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ మెథడ్ అని పేరు పెట్టారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం.. యోగా చేశాడు.. ఎందుకు?