Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో మరో కొత్త వైరస్ పురుడు పోసుకుంది... పేరు లంగ్యా హెనిఫా

Advertiesment
Langya Henipa
, బుధవారం, 10 ఆగస్టు 2022 (07:18 IST)
ప్రపంచాన్ని అతలాకుతలం చేసే కొత్త వైరస్‌లకు నిలయంగా డ్రాగన్ కంట్రీ అవతరించింది. ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు చేసింది. ఈ క్రమంలో చైనాలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ పేరు లంగ్యా హెనిఫా (LayV)గా గుర్తించారు. ఈ వైరస్ ఇప్పటికే 35 మంది వరకు సోకినట్టు తేలినట్టు తైవాన్‌కు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తెలిపింది. 
 
ఈ వైరస్‌ను, దాని వ్యాప్తిని గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పద్ధతిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్‌ విషయంలో చైనాను నిశితంగా గమనిస్తున్నట్టు తైవాన్ పేర్కొంది. షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సులలో ఈ ఇన్ఫెక్షన్లు వెలుగు చూశాయి. ఈ వైరస్‌పై నిఘా పెంచేందుకు, జినోమ్ సీక్వెన్సింగ్‌ కోసం దేశీయంగా ప్రయోగశాలల ఏర్పాటు చేసేందుకు ఒక ప్రామాణిక విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్ సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ జెన్-హ్సియాంగ్ తెలిపారు. 
 
ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులు సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది సోకితే మూత్రపిండ, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని 'తైపే టైమ్స్' పేర్కొంది. కాగా, ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు మరణాలు నమోదు కాలేదని తెలిపింది. అయితే, దీనిని మరింత పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు కరోనా