Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

4G స్మార్ట్‌ఫోన్‌లు 5G నెట్‌వర్క్‌లో పనిచేస్తాయా? (video)

Advertiesment
5G technology
, గురువారం, 18 ఆగస్టు 2022 (10:20 IST)
ప్రస్తుత 4G ఫోన్‌లు రాబోయే 5G నెట్‌వర్క్‌తో పనిచేస్తాయా, వీలైతే ఏ ఫోన్‌లు 5G సాంకేతికతను సపోర్ట్ చేస్తాయి, 4G మొబైల్‌లో పని చేస్తే భవిష్యత్తులో 5Gతో ప్రమాదమా, శాంసంగ్, ఐఫోన్ వంటి ఏదైనా స్మార్ట్‌ఫోన్‌లో 5G పని చేస్తుందా.. అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. 
 
5G టెక్నాలజీ అనేది వైర్‌లెస్ సెల్యులార్ టెలికమ్యూనికేషన్ సర్వీస్‌కు చెందిన అధునాతన వెర్షన్, ఇది 2019 ప్రారంభం నుండి అమలులో వుంది. 2019 సంవత్సరం నాటికి 5G టెక్నాలజీని, స్మార్ట్‌ఫోన్‌లను స్వీకరించిన మొదటి దేశాలలో కొరియా ఒకటి. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అన్నీ దేశాలకు వ్యాపిస్తోంది. 
 
5G టెక్నాలజీ వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మిల్లీమీటర్ వేవ్-ఆధారిత స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తుంది, కాబట్టి, 5G మిల్లీమీటర్ వేవ్ వేగంగా ఉంటుంది. ఈ సేవ అందించే వేగం 100 Mbps నుండి 10 వరకు ఉంటుంది.
 
కానీ మీరు 4G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే, మీ ప్రస్తుత ఫోన్‌లోని సాంకేతికత దానిని 5G స్పెక్ట్రమ్‌లో అమలు చేసేంత సామర్థ్యాన్ని కలిగి ఉండదు. 4జీ స్మార్ట్ ఫోన్లు వేగవంతమైన సిగ్నల్‌లను తట్టుకోలేవు. కారణం 4G స్మార్ట్‌ఫోన్ 4G క్యారియర్ సర్వీస్ లేదా 3G, 2G, 1G వంటి తక్కువ ఫ్రీక్వెన్సీ పరిధిని స్వీకరించడానికి మాత్రమే రూపొందించబడింది.
 
అయితే 5Gకి సపోర్ట్ చేయదు. కాబట్టి, సింపుల్‌గా చెప్పాలంటే.. 4G మొబైల్ ఫోన్‌లు 4G లేదా అంతకంటే తక్కువ సాంకేతికతను మాత్రమే పొందగల సాంకేతికతను కలిగి ఉంటాయి, కానీ 5G మొబైల్ ఫోన్‌ను కలిగి ఉంటే, మీరు 5Glతో పాటు అంతకంటే తక్కువ సాంకేతికతలను ఉపయోగించవచ్చు. దీనిని బట్టి 4జీ ఫోన్లు.. 5జీ స్పీడును తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యేలు, ఎంపీలను ట్రాక్ చేయాలి... యాప్ సిద్ధం.. పవన్ ట్వీట్ వైరల్