Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 6 March 2025
webdunia

12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తే.. ఇలాంటి ఆహారం పెడతారా?

Advertiesment
police
, శుక్రవారం, 12 ఆగస్టు 2022 (15:39 IST)
police
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఓ కానిస్టేబుల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోర్టు వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మనోజ్ కుమార్ బుధవారం భోజనం ప్లేటుతో రోడ్డుపైకి వచ్చి తన బాధను పంచుకున్నాడు. రోజుకు 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న తమకు ఇలాంటి భోజనం పెడతారా? అంటూ తమకు అందించిన రొట్టెలు, ఇతర పదార్థాలను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 
 
ఫిరోజాబాద్‌లోని మెస్‌లో అందించే భోజనం ఏమాత్రం బాగుండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుళ్లకు పోషకాహారం కోసం రూ. 1,875 ఇస్తామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఏమైందని ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాఖండ్‌: నీటిలో కొట్టుకుపోయిన ఏటీఎం.. రూ. 24లక్షలు స్వాహా