జార్ఖండ్‌లోని భిఖియాచక్ గ్రామంలోని తన పాఠశాల అద్వానమైన పరిస్థితులను ప్రదర్శిస్తూ ఒక బాలుడు రిపోర్టర్‌గా మారాడు. నివేదికల ప్రకారం, తరగతి గదులు, వాష్‌రూమ్‌లు, చేతి పంపు పరిస్థితిని చూపించడానికి 12 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ రిపోర్టర్‌గా అవతారం ఎత్తాడు.
ఈ వీడియోలో బాలుడు తన పాఠశాలలో అద్వానమైన పరిస్థితిని ప్రదర్శిస్తూ రౌండ్లు చేయడం చూడొచ్చు. కర్ర, ఖాళీ కోక్ బాటిల్‌ను మైక్‌గా ఉపయోగించుకున్నాడు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.