ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు తమ రాజ్యాన్ని అయితే నెలకొల్పారు. కానీ ప్రజలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు వారు చేస్తున్న యత్నాలు విఫలయత్నాలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన దగ్గర్నుంచి ఎన్నో మార్పులు, చట్ట సవరణలు, ఆంక్షలు పెడుతూ వెళ్తున్నారు.
ఈ నేపధ్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పలుచోట్ల పౌరులు రోడ్లెక్కి తాలిబన్ ప్రభత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినా అక్కడ పరిస్థితి మాత్రం మారలేదు. ప్రభుత్వంతో ప్రజలు విబేధిస్తున్నారు. మరి ఈ ఆందోళనలు ఎంతదూరం వెళ్తాయో చూడాలి.