Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కుంకుమ పువ్వు' నటుడికి మరో నటితో ఎఫైర్... అందుకే భారతి సూసైడ్ అంటున్నదెవరు?

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (17:05 IST)
కుంకుమ పువ్వు టీవీ సీరియల్‌తో పాపులర్ అయిన నటుడు మధు ప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన భార్య భారతి ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె తల్లిదండ్రుల వాదన మరోలా వుంది. తమ అల్లుడు మధుకి మరో నటితో ఎఫైర్ వుందని వారు ఆరోపిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా తమ కుమార్తెను అతడు వేధిస్తున్నాడనీ, రూ. 15 లక్షల కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశామని రోదిస్తున్నారు. చివరికి తమ కూతురు లేకుండాపోయిందని అంటున్నారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని వారు వాదిస్తున్నారు.
 
కాగా మధు ప్రకాశ్ వాదన మరోలా వుంది. తను వివిధ సీరియల్స్ షూటింగ్స్ కారణంగా ఇంటికి ఆలస్యంగా వస్తుండేవాడు. దీంతో ఆయనకు భార్యతో మనస్పర్థలు తలెత్తాయి. ఇదే అంశంపై వారిద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగింది. అయితే ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా షూటింగ్ నుంచి ఆలస్యంగా రావడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసింది. అయితే, మధుప్రకాష్ దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. 
 
ఈ క్రమంలో మంగళవారం భర్తకు వీడియో కాల్ చేసిన భారతి తాను ఉరివేసుకుంటున్నట్టు చెప్పి బెదిరించింది. మధుప్రకాశ్ దీనిని తేలిగ్గా తీసుకున్నాడు. షూటింగ్ ముగిశాక సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్లాడు. బెడ్‌రూంకు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో భార్యను పిలిచాడు. 
 
అయినప్పటికీ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి చూసి షాక్ తిన్నాడు. లోపల భార్య చీరతో సీలింగ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
కాగా, ఈ దంపతులకు గత 2015లో వివాహమైంది. వీరిద్దరూ హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో నివశిస్తున్నారు. మధుప్రకాశ్ టీవీ నటుడు కాగా, భారతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. షూటింగులలో బిజీగా ఉంటున్న మధుప్రకాశ్ ఇటీవల తరచూ ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం కూడా ఇదే విషయమై గొడవ జరిగి, చివరకు అది విషాదంతో ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments