Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

తేజ్ ప్రతాప్ ఆడంగి వేషాలు... భరించలేక వదిలేయాలనుకున్నా...

Advertiesment
Shocking
, బుధవారం, 7 ఆగస్టు 2019 (14:54 IST)
తన భర్త, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ మాదక ద్రవ్యాలకు బానిస అనీ, అతడు మహిళల వస్త్రాలు ధరించి ఆడంగి వేషాలు వేసేవాడని అతడి భార్య ఐశ్వర్య సంచలన ఆరోపణలు చేసింది.

అతడి చేష్టలు తనకు నచ్చక తీరు మార్చుకోవాలంటూ ఎన్నిసార్లు చెప్పినా అతడు వినిపించుకోలేదని, ఎన్నిసార్లు బ్రతిమాలి చెప్పినా పట్టించుకోలేదని, పైగా మహిళల చీరలు కట్టుకుని దేవతల్లా అలంకరణ చేసుకుని తిరుగుతుండేవాడని విడాకుల కేసు విచారణలో ఆమె కోర్టుకు తెలిపారు. 
 
తన భర్త చేస్తున్న చేష్టలను అడ్డుకున్నందుకు అతడి కుటుంబ సభ్యులంతా తనను వేధింపులకు గురిచేశారని ఆమె కోర్టులో ఆరోపించింది. ఇంకా ఆమె చెపుతూ... పెళ్లయ్యాక కొత్తలో ఇంటికి వచ్చాక ఓ రోజు ఆయన తన బ్లౌజు, స్కర్టు వేసుకున్నారనీ, ఆడవారిలో మేకప్ వేసుకుని విగ్ కూడా పెట్టుకున్నారనీ, ఆ వేషం చూసి షాక్ తిన్నానంటూ చెప్పారు.
 
కాగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇటీవలే శివుడు గెటప్పులో కనిపించిన సంగతి తెలిసిందే. ఇతడికి బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు అయిన ఐశ్వర్యరాయ్‌తో ఏడాది క్రితం వివాహమైంది. వారి కాపురం సజావుగా సాగుతూ వుండగానే తనకు విడాకులు కావాలని తేజ్ ప్రతాప్ అకస్మాత్తుగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై తీవ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ దోషి... పాకిస్తాన్ పంజాబ్ కోర్టు