రత్నకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం `ఆమె`లో హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా... ఈ సినిమా టీజర్‌ను బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తాజాగా విడుదల చేయడం జరిగింది.
టీజర్‌లోకి వెళ్తే.. తన కుమార్తె కనిపించలేదని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం.. అమలాపాల్ రక్తపు మడుగులో నగ్నంగా కనిపించడం.. ఇలా టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది.
అయితే... ఈ టీజర్‌పై సామాన్య ప్రేక్షకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నగ్నంగా కనిపించడానికి సిద్ధపడి అమల చాలా ధైర్యం చేసిందని, ఆమె నిజంగా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తూంటే... టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఈ సినిమా టీజర్‌ను ప్రశంసిస్తూ...``ఆమె` టీజర్ అద్భుతంగా ఉంది. ఆల్ ది బెస్ట్. సినిమా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా'నంటూ అక్కినేని కోడలు ట్వీట్ చేసింది.