ఆ పప్పు కాదు.. కందిపప్పు.. నాని చమత్కారం.. అసెంబ్లీలో నవ్వులే నవ్వులు

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (18:33 IST)
ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో నాలుగోరోజు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. ముందుగా టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పప్పులు నిప్పులయ్యాలన్నారు. 
 
వంట నూనె, కూరగాయల ధరలు చుక్కలంటాయని.. వీటిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని భవానీ డిమాండ్ చేశారు. ఇవన్నీ చాలనట్టు ఇటీవలే ఆర్టీసీ చార్జీలు కూడా పెంచారని ఆమె గుర్తు చేశారు.
 
ఆదిరెడ్డి భ‌వానీ ప్ర‌శ్న‌ల‌కు పౌర‌స‌ర‌ప‌రాల శాఖా మంత్రి కొడాలి నాని స‌మాధానం ఇచ్చారు. ప్ర‌తి సంవ‌త్స‌రం నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయ‌ని చెప్పారు. వాటిని ధ‌ర‌ల పెరుగుద‌ల‌గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోర‌ని వెల్లడించారు. 
 
ఈ సంద‌ర్భంగానే ఆయ‌న ప‌ప్పుల రేట్లు గురించి మాట్లాడుతుండ‌గా.. ఆయ‌న వెన‌క ఉన్న వైసీపీ స‌భ్యులు ఏ ప‌ప్పు అని సరదాగా వ్యాఖ్యానించగా, అప్పుడు నాని ఆ ప‌ప్పు కాదు లెండి.. కందిప‌ప్పు అండి ఆన్స‌ర్ ఇవ్వ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా న‌వ్వారు. 


ఇక వైసీపీ వాళ్లు నారా లోకేష్‌ను ప‌ప్పు అని విమ‌ర్శించ‌డం అంద‌రికి తెలిసిందే. ఇప్పుడు నాని కూడా లోకేష్ పేరు ఎత్త‌క‌పోయినా ప‌రోక్షంగా ఆ ప‌ప్పు కాదు… కందిప‌ప్పు అని చ‌మ‌త్క‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments