Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసెంబ్లీ సమాచారం.. ప్రభుత్వ సలహాదారుల పోస్ట్‌లపై సభలో రగడ

అసెంబ్లీ సమాచారం.. ప్రభుత్వ సలహాదారుల పోస్ట్‌లపై సభలో రగడ
, బుధవారం, 11 డిశెంబరు 2019 (12:29 IST)
సలహాదారుల నియామకంలో సామాజిక రిజర్వేషన్ పాటించారా అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని
ప్రశ్నించారు. ఆర్ధిక సంక్షోభం ఉందని.. రూపాయి జీతం అంటున్న ప్రభుత్వం ఇంత మంది సలహా దారులను ఎందుకు తీసుకున్నారని ఆయన అడిగారు. 
 
సలహాదారులు నియామకాల్లో ఎంత మంది బీసీలు ఉన్నారన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్..70 మంది నియామకాల్లో ఒకే వర్గానికి ఎలా అవకాశం ఇస్తారా అని టీడీపీ ప్రశ్నించింది. 
 
మరోవైపు సచివాలయం ఫైర్‌ స్టేషన్‌ వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన చేశారు. ఇందులో బాలకృష్ణ, ఇతర నేతలు
 
మంగళగిరి నుంచి సచివాలయం బస్టాప్‌ వరకు బస్సులో ప్రయాణం చేపట్టారు. పల్లెవెలుగు బస్సులో నారా లోకేశ్ సచివాలయం బస్టాప్‌కు వచ్చారు. ఈ సందర్భంగా  దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 
 
అసెంబ్లీ జరిగేటప్పుడు సభ అభిప్రాయం తీసుకోకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ఇది గర్వంతో కొవ్వెక్కి తీసుకున్న నిర్ణయం తప్ప మరొకటి కాదని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
ఎన్నికల ముందు ఏమీ పెంచేది లేదని చెప్పి.. రోజుకో సమస్య ప్రజలపై మోపుతున్నారు, ఆర్టీసీ ఛార్జీల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎకరంలో... కేసీఆర్ మహారాజ ప్యాలెస్.. 22న గృహప్రవేశం.?