Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 30వరకు అన్ని రైల్ రిజర్వేషన్ టిక్కెట్లు రద్దు... శ్రామిక్ రైళ్లు యధాతథం

Webdunia
గురువారం, 14 మే 2020 (11:01 IST)
ఇండియన్ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 30వ తేదీవరకు అన్ని రైల్ టిక్కెట్లను రద్దు చేసింది. అంటే... అప్పటి వరకు రైలు సర్వీసులు అందుబాటులో ఉండవని చెప్పకనే చెప్పింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి డబ్బును రైల్వే శాఖ తిరిగి అందజేయనుంది. అయితే, వలస కూలీల తరలింపునకు నడుపుతున్న శ్రామిక్ రైళ్లు, అలాగే, దేశంలోని 15 ముఖ్య నగరాలకు నడుపుతున్న రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని పేర్కొంది. 
 
రైల్వే శాఖ తీసుకున్న కీలక నిర్ణయంతో నాలుగో దశ లాక్డౌన్ వచ్చే నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందా అన్న సందేహం తలెత్తుతోంది. కేంద్రం ఇచ్చిన సంకేతాలతోనే రైల్వే శాఖ ఈ తరహా నిర్ణయం తీసుకునివుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ నెల 18వ తేదీన లాక్డౌన్‌పై స్పష్టత ఇస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రైల్వే శాఖ జూన్ 30వ తేదీ వరకు అన్ని రైళ్ల రిజర్వేషన్ టిక్కెట్లను రద్దు చేయడంతో లాక్డౌన్ పొడగింపు తథ్యమని భావిస్తున్నారు. 

ఇక.. వెయిటింగ్ లిస్ట్ జాబితా 
రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ వేళ దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 ప్రధాన నగరాలకు రెండు జతల రైళ్ళను నడుపుతోంది. వీటిలో కొన్ని డైలీ సర్వీసులు, మరికొన్ని వారంతపు, బై వీక్లీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అయితే, ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటే కేవలం ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ను రిజర్వేషన్ చేసుకోవాల్సివుంది. అంటే కేవలం రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే ఈ రైళ్ళలో ప్రయాణించే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం, కేంద్రం ఆదేశాల మేరకు.. ఈ నెల 1వ తేదీ నుంచి వలస కూలీలను తరలించేందుకు, ఆపై ప్రత్యేక రైళ్లను కలిపి, ఇప్పటివరకూ 366 రైళ్లను నడిపింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా దశల వారీగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో టికెట్ కన్ఫర్మ్ అయిన వారిని మాత్రమే అనుమతిస్తున్నామని, ఈ నెల 22వ తేదీ నుంచి తిరిగే రైళ్లలో మాత్రం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కూడా ఉంటాయని పేర్కొంది. 
 
22వ తేదీ నుంచి నడిచే అన్ని రైళ్ళలో ప్రయాణానికి ఈ నెల 15వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాని తెలిపింది. ఇందులో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల విక్రయాలు కూడా ఉంటాయని వెల్లడించింది.
 
ఈ వెయిట్ లిస్ట్‌ జాబితాలో స్లీపర్ క్లాసులో 200, చెయిర్ కార్, థర్డ్ ఏసీలో 100, సెకండ్ ఏసీలో 50, ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో 20 టిక్కెట్లు చొప్పున వెయిటింగ్ లిస్ట్ టికెట్లను జారీ చేస్తామని తెలిపింది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ దెబ్బకు ప్రజా రవాణాను పూర్తిగా బంద్ చేసిన విషయం తెల్సిందే. ఈ లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 12 వేల రైళ్లను రైల్వే శాఖ నడుపుతూ వచ్చింది. లాక్డౌన్ ప్రకటన వెలువడిన తర్వాత అన్ని రైళ్లను నిలిపివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments