Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్ ఎఫెక్టు : ఆచార్య షూటింగ్ వాయిదా - అది నా బాధ్యత : చిరంజీవి

Advertiesment
Chiranjeevi
, ఆదివారం, 15 మార్చి 2020 (11:34 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను మన దేశంలో జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించింది. ఈ వైరస్ దెబ్బకు అనేక క్రీడా పోటీలు వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లు కూడా వాయిదాపడుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను కూడా వాయిదా వేశారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నెల 21 వ‌ర‌కు సినిమా థియేట‌ర్స్, ప‌బ్స్‌, క్ల‌బ్స్‌, అవుట్ డోర్‌, ఇండోర్ స్టేడియాలు, పార్కులు, మ్యూజియాలుతో పాటు.. విద్యా సంస్థలను ఈ నెల 31వ తేదీ వరకు మూసివేసింది. 
 
ఈ నేప‌థ్యంలో కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఇందుకోసం తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల పట్ల హర్షం వ్యక్తంచేశారు.
 
కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా క్రీడలను వాయిదా వేయడం, సినిమా హల్స్‌ను, మాల్స్‌ను మూసివేడయం, స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామమన్నారు. ప్రజలు కూడా ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. సినిమా షూటింగుల్లో కూడా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు పనిచేయాల్సి ఉందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుండి 15 రోజుల వరకు షూటింగులు వాయిదా వేస్తే మంచిదని భావిస్తున్నానన్నారు.
 
ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే సరేనన్నారని చెప్పారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కాబట్టి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అకవాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని చిరంజీవి పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ 4కి ప్లాన్, ఈసారి హోస్ట్ ఎవరు?