Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ 4కి ప్లాన్, ఈసారి హోస్ట్ ఎవరు?

Advertiesment
Big boss 4
, శనివారం, 14 మార్చి 2020 (22:10 IST)
బిగ్ బాస్.. టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనం. ఈ గేమ్ షోకు ఎంతటి ఆదరణ లభించిందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు వచ్చిన గేమ్ షోలకు ఇది పూర్తి భిన్నంగా ఉండటం.. అలాగే ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో బిగ్ బాస్ విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించింది.

బిగ్ బాస్ సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. అప్పటివరకు ఎన్టీఆర్ ఎప్పుడూ బుల్లితెరపై హోస్ట్‌గా చేయకపోవడం.. ఎన్టీఆర్‌కు మాస్‌లో మాంచి క్రేజ్ ఉండటంతో ఈ షో సక్సెస్ అయ్యింది. ఈ షోను పూర్తిగా అర్థం చేసుకుని ఎన్టీఆర్ ఈ షోను నడిపించిన తీరు ఎంతైనా అభినందనీయం.
 
ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన ఫస్ట్ సీజన్ సక్సెస్ కావడంతో సెకండ్ సీజన్‌కు కూడా ఎన్టీఆరే హోస్ట్ అనుకున్నారు. అయితే... ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండటంతో.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వలన సెకండ్ సీజన్‌కు నో చెప్పారు. సెకండ్ సీజన్‌కు హోస్ట్‌గా ఎవరు వస్తారా అనుకుంటుంటే... నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పడం.. షోను తనదైలన స్టైల్‌లో నడిపించడం జరిగింది. అయితే... నాని హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. నానిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
 
ఇక బిగ్ బాస్ సీజన్ 3కి టాలీవుడ్ కింగ్ నాగార్జున హాస్ట్‌గా చేయడం విశేషం. నాగార్జునకు లేడీస్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరు షోను చేసిన అనుభవం కూడా ఉండటంతో బిగ్ బాస్ షోను నాగార్జున చాలా ఈజీగా తనదైన స్టైల్‌లో నడిపించారు. ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లో చిరు - నాగ్ చేసిన సందడి చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు అన్నట్టుగా ఉండటంతో టీఆర్పీలో సరికొత్త రికార్డు సృష్టించింది.
 
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం... న్యూ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారని తెలిసింది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్‌ బాబు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నాగార్జున, మహేష్‌ బాబు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సీజన్ 4కు హోస్ట్‌గా ఉంటారని టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను అక్కడికి రానని దర్సకనిర్మాతలను పంపేస్తున్న కియారా, ఎక్కడికి?