Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్జీ గేమ్‌తో మైనర్ బాలికతో వల... ఊచలు లెక్కిస్తున్న యువకుడు

Advertiesment
పబ్జీ గేమ్‌తో మైనర్ బాలికతో వల... ఊచలు లెక్కిస్తున్న యువకుడు
, ఆదివారం, 29 డిశెంబరు 2019 (12:38 IST)
పబ్జీ గేమ్‌తో ఓ మైనర్ బాలికకు వల వేసిన ఓ యువకుడు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ గేమ్‌ ద్వారా బాలిక వాట్సాప్ నంబరును తీసుకున్న ఆ యువకుడు ఈ వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ నాంపల్లికి చెందిన సల్మాన్‌ ఖాన్‌ అనే యువకుడు సదరు బాలికకు పబ్జీ గేమ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నెంబర్‌ తీసుకున్నప్పటి నుంచి అమ్మాయితో చాటింగ్‌ చేసిన యువకుడు అమ్మాయి పర్సనల్‌ ఫోటోలు సంపాదించాడు. ఇక అప్పటి నుంచి వాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. 
 
అమ్మాయి ఫోటోలతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతానని వేదించడం మొదలు పెట్టాడు. అసభ్యకరంగా మాట్లాడడమేకాక, తనతో శారీరకంగా గడపాలని లేదంటే ఫోటోలు బహిర్గతం చేస్తానని బ్లాక్‌ మెయిలింగ్‌ చేశాడు. వెంటనే బాలిక పేరెంట్స్‌కి విషయం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గేమ్స్‌ పేరుతో ట్రాప్‌ చేసి రాంగ్‌ గేమ్‌ ఆడబోయిన యువకుడు ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు రాజధానులు : హైపర్ కమిటీ ఏర్పాటు - సభ్యులు వీరే