మెగాస్టార్ చిరంజీవికి చెన్నై చిన్నది త్రిష తేరుకోలేని షాకిచ్చింది. చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. అయితే, ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. పైగా, ఈ చిత్రం నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	"సృజనాత్మక వైరుధ్యాల కారణంగా 'ఆచార్య' నుంచి తప్పుకుంటున్నాను. కొన్నిసార్లు మనతో చర్చించిన విషయాలు ఒకటైతే, వాస్తవంలో కనిపించేవి వేరేగా ఉంటాయని, చిరంజీవి సార్ సినిమా నుంచి తప్పుకుంటున్నందుకు ఈ విభేదాలే కారణమని వివరణ ఇచ్చింది. అయితే, మరో మంచి సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వస్తాను" అని త్రిష తన ట్వీట్‌లో పేర్కొంది.