బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తన ఎనిమిదో చిత్రాన్ని కందిరీగ, రభస చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో చేస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ఖాయం చేశారు. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
హిలేరియస్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మరోసారి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే స్క్రిప్టుతో అల్లుడు అదుర్స్ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. సినిమా చాలా బాగా వస్తున్నదనే ఆనందం యూనిట్ అందరిలో కనిపిస్తోంది. ఈ సినిమా వేసవిలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఆహ్లాదకరమైన వినోదం అందించడం ఖాయం అంటున్నారు. అంతేకాదు... యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. టైటిల్ పోస్టర్‌లో చుట్టూ అమ్మాయిలతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
ఆయన సరసన హీరోయిన్లుగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూ సూద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీకి టైటిల్ అల్లుడు అదుర్స్ అని పెట్టడం వెనుకు ఓ సీక్రెట్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటంటే.. ఘరానా అల్లుడు, అల్లుడు గారు, అల్లరి అల్లుడు, రౌడీ అల్లుడు, అనసూయమ్మ గారి అల్లుడు, అల్లుడు శీను, శైలజారెడ్డి అల్లుడు... తెలుగు సినిమా టైటిల్స్‌లో అల్లుడు అని వచ్చిన సినిమాల్నీ దాదాపు విజయం సాధించాయి.
సెంటిమెంట్ వర్కువుట్ అవుతుంది సినిమా విజయం సాధిస్తుందనేది ఒక కారణం అయితే.. ఈ కథ ప్రకారం అల్లుడు అదుర్స్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అందుకునే ఈ సినిమాకి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ఖరారు చేసారని సమాచారం. మరి.. అల్లుడు అదుర్స్.. బాక్సాఫీస్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 30 వరకు ఆగాల్సిందే.