Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దర్శకేంద్రుడు నాకు మామ అవుతారా? ఎలా.. క్లారిటీ ఇచ్చిన అనుష్క

దర్శకేంద్రుడు నాకు మామ అవుతారా? ఎలా.. క్లారిటీ ఇచ్చిన అనుష్క
, శుక్రవారం, 13 మార్చి 2020 (17:25 IST)
అనుష్క శెట్టి
టాలీవుడ్ అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్ర రావు. ఈయన కుమారుడు ప్రకాష్. టాలీవుడ్ యువ దర్శకుడు. ఈయన టాలీవుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై అనుష్క ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కోవెలమూడి ప్రకాష్‌ను వివాహం చేసుకోవడం ఖాయమనే ప్రచారం సాగింది. 
 
ఈ నేపథ్యంలో అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం వచ్చే నెల నాలుగో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే, అనుష్క శెట్టి సినీ రంగ ప్రవేశం చేసి 15 యేళ్ల పూర్తయింది. ఈ సందర్భంగా నిశ్శబ్దం చిత్ర బృందం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో తన పెళ్లి వార్తలపై అనుష్క క్లారిటీ ఇచ్చింది. 
 
టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడి కుమారుడు అయిన సదరు వ్యక్తితో తన పెళ్లి విషయం ఒట్టి పుకారే అని కొట్టిపారేసింది. తన పెళ్లి గురించి కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాంటి పుకార్ల వల్ల తానేమీ ఇబ్బంది పడనని చెప్పింది. అయితే, తన పెళ్లి గురించే అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని అనుష్క వాపోయింది. 
webdunia
వివాహం అనేది తన వ్యక్తిగత విషయమని అనుష్క చెప్పింది. ఇతరులు తన వ్యక్తిగత జీవితంలోకి చొరబడితే తనకు అస్సలు నచ్చదని స్పష్టం చేసింది. బంధాలను ఎవరూ దాచలేరని, అలాగే తన పెళ్లి విషయాన్ని బయటపెట్టకుండా తానెందుకు దాస్తానని ఆమె అభిప్రాయపడింది. అయితే, ఎవరిని పెళ్లిచేసుకోబోయేది బహిరంగంగా ప్రకటించకపోవచ్చు అని చెప్పింది. కానీ, పెళ్లి జరిగిన తర్వాత ఈ విషయం గురించి తనను ఎవరైనా అడగొచ్చని, వాళ్లకు సమాధానం చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ పరుగు హీరోయిన్ షీలా పెళ్లయిపోయింది