Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళయిన మూడు రోజులకే భార్య రెండు నెలల గర్భవతి.. భర్త షాక్

Advertiesment
పెళ్ళయిన మూడు రోజులకే భార్య రెండు నెలల గర్భవతి.. భర్త షాక్
, మంగళవారం, 10 మార్చి 2020 (18:45 IST)
అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉత్సాహంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడికి మూడు రోజులకే షాకిచ్చింది భార్య. కడుపు నొప్పితో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె రెండో నెల గర్భవతి అని డాక్టర్లు చెప్పారు. ఏం జరిగిందో అర్ధంగాక ఆ యువకుడు తల పట్టుకున్నాడు. చివరికి భార్య తనను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌‌లో వెలుగుచూసింది.
 
బులంద్‌షహర్ జిల్లా నైమాండి చౌకి గ్రామానికి చెందిన ఓ యువకుడికి మార్చి 6వ తేదీన వివాహం జరిగింది. పెళ్లయిన మూడోరోజే ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు గర్భవతి అని తేల్చారు. పెళ్లయిన మూడు రోజులకు రెండు నెలల గర్భం ఎలా వస్తుందని ఆలోచనలో పడిన ఆ యువకుడు కాసేపటికే నిజాన్ని గ్రహించాడు. ఏం జరిగిందని భార్యను నిలదీయగా ఆమె అసలు నిజం చెప్పింది.
 
​బులంద్‌షహర్ జిల్లాకి చెందిన ఆమె అలీఘర్‌కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. సినిమాలు, షికార్లంటూ ఆ ప్రేమజంట విచ్చలవిడిగా తిరుగుతూ హద్దులు దాటేసింది. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ శారీరకంగానూ కలిశారు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను నిర్బంధించి మరో యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లయిన వెంటనే ఆమె అస్వస్థతకు గురికావడంతో గర్భం విషయం వెలుగులోకి వచ్చింది. తన కడుపులోని బిడ్డకు తన ప్రియుడే తండ్రి అని నవవధువు అందరి ఎదుట ఒప్పుకుంది.
 
దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ప్రియుడితో శారీరకంగా కలిసిన తర్వాత కూడా తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని, ఆమె కారణంగా తన కుటుంబ పరువు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు తాను ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని, అత్తారింటికి వెళ్తే తనకు ప్రాణహాని ఉంటుందని ఆ యువతి న్యాయస్థానానికి విన్నవించుకుంది. దీంతో స్పందించిన న్యాయస్థానం సమస్య పరిష్కారమయ్యే వరకు ఆమెను జిల్లా ఆస్పత్రిలోని జ్యోతి కేంద్రంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెప్పుతో కొట్టినట్లు పంపేశారు, నన్ను ఇబ్బందిపెట్టినవారు బతికిలేరు: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ