Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మన్మథుడి' ఫేవరేట్ హీరోయిన్ స్వీటీ అరుదైన రికార్డు

Advertiesment
'మన్మథుడి' ఫేవరేట్ హీరోయిన్ స్వీటీ అరుదైన రికార్డు
, శుక్రవారం, 13 మార్చి 2020 (14:41 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో స్వీటీగా గుర్తింపు పొందిన హీరోయిన్ అనుష్క. ఈమె సినీ కెరీర్‌ను ప్రారంభించి 15 యేళ్లు పూర్తిచేసుకుంది. టాలీవుడ్ మన్మథుడు నటించిన చిత్రం సూపర్. ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. అప్పటి నుంచి సినీ కెరీర్ విజయవంతంగా సాగిపోతోంది. ఆమె సినిమా అవకాశాల కోసం ఏనాడూ వెంపర్లాడలేదు. కానీ, సరైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. 
 
ఈ క్రమంలో ఆమె నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రిరిలీజ్ ఫంక్షన్‌తో పాటు.. అనుష్క 15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ నిర్వహించింది 
 
ఇందులో పలువురు సినీ దర్శక నిర్మాతలు, హీరోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు పాల్గొని తనకు ఇష్టమైన స్వీటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 'శ్రీ‌రామ‌దాసు' సమయంలో ఓ సారి నాగార్జున గెస్ట్ హౌస్‌కు వెళ్లాను. ఆయ‌న 'డైరెక్ట‌ర్‌గారూ స‌రైన టైమ్‌కు వ‌చ్చారు. మీకో కొత్త హీరోయిన్‌ను చూపించాలి' అని చెప్పి.. 'స్వీటీ' అని పిలిచాడు. అప్పుడు ఈ అమ్మాయి సెల్లార్ నుంచి మెట్లెక్కుతూ పైకి వ‌చ్చింది. 
 
అప్పుడు ఆమెతో 'నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావ్ స్వీటీ' అని చెప్పాను. ఇవాళ అనుష్కను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ప్ర‌య‌త్నిస్తే సినిమాలు దొరుకుతాయ్‌. కానీ అనుష్క విష‌యంలో క్యారెక్ట‌ర్లే అమెను వెతుక్కుంటూ వ‌చ్చాయ్‌. ఈ జ‌న‌రేష‌న్‌లోని మ‌రే హీరోయిన్‌కీ ఆ అదృష్టం ద‌క్క‌లేదు. తెలుగులోనే కాకుండా త‌మిళ‌నాడులో, క‌ర్ణాట‌క‌లోనూ ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అనుష్క జ‌న్మ ధ‌న్యం అని రాఘవేంద్రరావు అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతి ఎంతమందితో డేటింగ్ చేయొచ్చు? నేహా ధూపియా ఆన్సరేంటి?