ఎవరు నాతో ఆడుకోవట్లేదు.. వారిని అరెస్ట్ చేయండి.. పోలీసులకు బాలుడి ఫిర్యాదు

Webdunia
గురువారం, 14 మే 2020 (10:07 IST)
కేరళలో ఓ బాలుడు వింతగా పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో తన సోదరితో పాటు ఐదుగురు బాలికలు తనతో ఆడేందుకు నిరాకరిస్తున్నారని, వారిని అరెస్టు చేయాలని ఎనిమేదేళ్ల బాలుడు సాక్షాత్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ నగరంలో వెలుగుచూసింది. 
 
అమాయకుడైన 8ఏళ్ల ఉమర్ నిదమ్ అక్కతోపాటు బాలికలు తనతో ఆటలు ఆడటం లేదని తన తండ్రితో చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయమని సరదాగా చెబితే బాలుడు నిజంగా ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తాను అబ్బాయినని తనతో లుడో, షటిల్, దొంగ పోలీసు ఆటలను అక్కతో పాటు ఐదుగురు బాలికలు ఆడటం లేదని ఉమర్ నిదర్ అనే బాలుడు కస్బా పోలీసుస్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
లాక్ డౌన్ వల్ల తాను బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి నెలకొందని, స్నేహితులతో కాకుండా అక్కతో కలిసి ఆడుకుందామంటే వారు ఎగతాళి చేస్తున్నారని మూడోతరగతి చదువుతున్న ఉమర్ నిదర్ ఇంగ్లీషులో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు ఉమేష్, నీరజ్‌లు బాలుడి ఇంటికి వచ్చి బాలుడి ఫిర్యాదుపై దర్యాప్తు జరిపారు. తనను కూడా ఆడేందుకు అనుమతించాలని కోరినా బాలికలు తిరస్కరించారని బాలుడు పోలీసులకు చెప్పాడు. బాలుడితో కలిసి ఆడాలని తాను బాలికలకు సలహా ఇచ్చామని పోలీసు అధికారి నీరజ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments