Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో ఈ-పాస్‌ల జారీ : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే...

Advertiesment
ఏపీలో ఈ-పాస్‌ల జారీ : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే...
, గురువారం, 14 మే 2020 (08:24 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసే చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో ప్రజా రవాణా పూర్తిగా బంద్ అయింది. ఈ కారణంగా అత్యవసర పనులపై వెళ్లాలనుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-పాస్‌లను జారీ చేయాలని నిర్ణయించింది. 
 
అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి మాత్రమే ఈ-పాస్‌లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
పై కారణాలతో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ-పాస్‌లు జారీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ-పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సమర్పించిన వివరాలను పోలీసులు ఆమోదిస్తే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌలు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి అంటించాడు