కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా రైలు సేవలు కూడా ఆగిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా దేశ సరిహద్దుల నుంచి ప్రారంభమయ్యే అనేక రైళ్ళను రైల్వే శాఖ రద్దు చేస్తోంది. అలాగే, దూర ప్రాంతాల రైళ్లను ఆయా రైల్వే జోన్లు రద్దు చేస్తున్నాయి.
పైగా, దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనిప్రభావం రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా లక్షల సంఖ్యలో రైలు టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
కొన్నింటిని ఈ నెలాఖరు వరకూ, మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రైళ్లలో 30 శాతం ప్రయాణికులు కూడా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
అలాగే, కరోనా వైరస్ మరింతమందికి వ్యాపించకుండా, ఫ్లాట్‌ఫాంలపై రద్దీ తగ్గించేందుకు వీలుగా ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధరను రూ.50కు పెంచేసింది. తాజాగా రద్దయిన రైళ్ల వివరాలు పరిశీలిస్తే...
* కాకినాడ టౌన్ - లింగంపల్లి (02775) మార్చి 31 వరకు
* లింగంపల్లి - కాకినాడ టౌన్ (02776) మార్చి 31 వరకు
* మచిలీపట్నం - సికింద్రాబాద్ (07049) మార్చి 22 నుంచి 29 వరకు
* సికింద్రాబాద్ - మచిలీపట్నం (07050) మార్చి 22 నుంచి 29 వరకు
* యర్నాకులం - హైదరాబాద్ (07118) మార్చి 25, 26 తేదీల్లో
* హైదరాబాద్ - యర్నాకులం (07117) మార్చి 25, 26 తేదీల్లో
* హైదరాబాద్ - విజయవాడ (07257) మార్చి 23 నుంచి 30 వరకు
* తిరుచిరాపల్లి - హైదరాబాద్ (07609) మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు
* హైదరాబాద్ - తిరుచిరాపల్లి (07610) మార్చి 25 నుంచి 30 వరకు
* హెచ్‌ఎస్ నాందేడ్ - ఔరంగాబాద్ (17620) మార్చి 20 నుంచి 27 వరకు
* ఔరంగాబాద్ -హెచ్‌ఎస్ నాందేడ్ (17619) మార్చి 23 నుంచి 30 వరకు
* ఔరంగాబాద్ - రేణిగుంట (17621) మార్చి 20 నుంచి 27 వరకు
* రేణిగుంట - ఔరంగాబాద్ (17622) మార్చి 21 నుంచి 28 వరకు
* తిరుపతి - చెన్నై సెంట్రల్ (16204) మార్చి 18 నుంచి 31 వరకు
* చెన్నై సెంట్రల్ - తిరుపతి (16203) మార్చి 18 నుంచి 31 వరకు
* కాన్పూర్ - కాచిగూడ (04155) మార్చి 26న నడిచే రైలు
* కాచిగూడ - కాన్పూర్ (04156) మార్చి 27న నడిచే రైలు