Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొన్న రొట్టెలు చేస్తున్న మహిళను కత్తితో పొడిచిన దండగుడు

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ దండగుడు మహిళను కత్తితో పొడిచి చంపాడు. మృతురాలు జొన్నరొట్టెలు తయారు చేస్తుండగా ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జగద్గిరిగుట్ట షిరిడీకు చెందిన కవిత (35) అనే మహిళ తన ఇంటి ముందే జొన్నరొట్టెలు తయారు చేసి, వాటిని విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇదే కాలనీలో గ్యాస్ సప్లయ్ చేసే యాదగిరి అనే వ్యక్తి జొన్నరొట్టెలు చేస్తున్న సమయంలో ఆమె వద్దకు వచ్చి వాదనకు దిగారు. 
 
అప్పటికే పీకలవరకు మద్యం సేవించివుండటంతో నిగ్రహం కోల్పోయిన యాదగిరి ఆమెను కత్తితో కిరాతకంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ మహిళ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యాదగిరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments