Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చార్మినార్ లాడ్జిలో మైనర్ బాలికపై తెరాస నేత అత్యాచారం

Advertiesment
TRS leader Shajid Khan
, సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (07:13 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేత ఒకరు నీచానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని బాలికపై అత్యాచారం చేశాడు. దావత్ పేరుతో చార్మినార్‌కు తీసుకెళ్లి అక్కడ ఓ లాడ్జిలో ఉంచి అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి పాల్పడింది నిర్మల్ మునిసిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్ ఖాన్. దీనిపై బాధిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మల్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడుని అరెస్టు చేశారు. మధ్యవర్తిత్వం వహించి మహిళ, కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తెరాస అధినాయకులు ఆయన్ను వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. 

 
నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి కథనం ప్రకారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథపేటకు చెందిన తెరాస నేత షేక్ సాజిద్ ఖాన్ స్థానిక వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై చిన్న వయసులోనే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అలంకరించాడు. ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరైన సాజిద్.. అక్కడ 16 యేళ్ల బాలికపై కన్నేశాడు. ఆ బాలికను లొంగదీసుకునేందుకు అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దించాడు. 

 
బాలికను నమ్మించిన ఆ మహిళ హైదరాబాద్‌లో దావత్ ఉందని, అక్కడ వరకు తనకు తోడుగా రావాలని కోరింది. తెలిసిన మహిళే కావడంతో ఆ బాలిక అన్నపూర్ణమ్మ వెంట వెళ్లింది. ఆ తర్వాత వారిద్దరు సాజిద్ పంపిన కారులో ఎక్కి హైదరాబాద్‌కు వెళ్లారు. అప్పటికే చార్మినార్ ప్రాంతంలో ఉన్న ఓ లాడ్జిలో బసచేసివున్న సాజిద్‌కు బాలికను అన్నపూర్ణమ్మ అప్పజెప్పింది. ఆ తర్వాత ఆ కామాంధుడు ఆ బాలికను చెరబట్టి అత్యాచారం చేశాడు. 

 
పైగా, ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆ బాలికను బెదిరించాడు. విషయం బయటకు పొక్కితే చంపేస్తానని హెచ్చరించాడు. ఆ తర్వాత సాయంత్రానికి భయంభయంగా ఇంటికి వచ్చిన బాలికను తల్లి గమనించి నిలదీసింది. దీంతో ఆ బాలిక బోరున ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పడంతో సాజిద్‌తో పాటు అన్నపూర్ణమ్మ, కారు డ్రైవర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ముగ్గురిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్‌కు బై బై... ఆఫ్‌లైన్‌‌కు హాయ్‌ హాయ్‌...