సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

ఠాగూర్
ఆదివారం, 30 నవంబరు 2025 (13:23 IST)
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఒకవైపు నామినేషన్లు జోరుగా వేస్తున్నారు. మరోవైపు, రాత్రికిరాత్రి ఏకగ్రీవాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో ఓ ఎస్ఐ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఉద్యోగ సర్వీసు మరో ఐదు నెలలు ఉంది. అయితే, స్వగ్రామంలో పోటీ చేయాలనే ఆకాంక్షతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఆయన పేరు పులి వెంకటేశ్వర్లు. కోదాడ పోలీస్ స్టేషనులో ఎస్ఐగా పని చేస్తున్నారు. కోదాడ మండల పరిధిలోని ఆయన స్వగ్రామం గుడిబండలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయ పదవుల కోసం ప్రభుత్వం ఉద్యోగులు తమ అవకాశాలను బట్టి రాజీనామాలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. 
 
గతంలో పలువురు ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు సైతం తమ పదవులకు రాజీనామా చేసి, తమకు నచ్చిన రాజకీయ పార్టీల చేరి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరికొందరు ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి రాణిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments