Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ పర్యటనలో ఝులక్ - టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నేతలు

Advertiesment
tdp cadre

ఠాగూర్

, గురువారం, 9 అక్టోబరు 2025 (17:03 IST)
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనలో గట్టి షాక్ తగిలింది. ఒకవైపు జగన్ పర్యటిస్తుండగానే వైకాపాకు చెందిన వెయ్యి మంది నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పర్యటన రోజునే వైకాపాకు చెందిన మాజీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌లు వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరడం స్థానిక వైకాపా నేతల్లో కలకలం చెలరేగింది. ఒకవైపు పార్టీ అధినేత నర్సీపట్నంలో పర్యటనలో ఉన్న సమయంలో వెయ్యిమంది కార్యకర్తలు ఇలా పార్టీ ఫిరాయించడం చర్చనీయాంశంగా మారింది. 
 
దళిత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పకుండా, కట్టని వైద్య కాలేజీల గురించి జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారంపై ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. కాగా, వైకాపాకు రాజీనామాచేసిన వారిలో వైకాపా మాజీ చైర్ పర్సన, వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. జగన్ ఫేక్ పర్యటన చేస్తున్న రోజే వైకాపాకు చెందిన నేతలు, కార్యకర్తలు రాజీనామా చేసి టీడీపీలో చేరడం గమనార్హం. 
 
శ్మశానంలో దొంగలు పడ్డారు.. కపాలం ఎత్తుకెళ్ళారు... 
 
శ్మశానంలో దొంగలుపడ్డారు. వీరు మనిషి పుర్రె (కపాలం)ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్‌గావ్‌ శ్మశానవాటికలో జరిగింది. చితిలో గాలించి మరీ కపాలం ఎత్తుకెళ్లారు. ముందురోజు సాయంత్రం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని ఒంటిపై ఉన్న నగలను తీయకుండా ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారు. తులం బంగారం కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జల్‌గావ్‌కు చెందిన ఛాబాబాయి కాశీనాథ్ పాటిల్ అనే వృద్ధురాలు ఈ నెల 5వ తేదీన మరణించింది. అంత్యక్రియలను కుటుంబ సభ్యులు సోమవారం నిర్వహించారు. ఛాబాబాయి చివరి కోరిక మేరకు ఆమె ఒంటిపై ఉన్న నగలను అలానే ఉంచి దహనం చేశారు. 
 
మరుసటి రోజు అంటే మంగళవారం అస్థికల కోసం శ్మశానం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడి పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. చితిలోని బూడిద చిందరవందరంగా పడివుండగా ఎముకలు, కపాలంలు మాత్రం కనిపించకుండా పోయాయి. దీంతో ఛాబాబాయి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బంగారం కోసమే దొంగలు ఛాబాబాయి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్ళివుంటారని వారు ఆరోపిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్మశానంలో దొంగలు పడ్డారు.. కపాలం ఎత్తుకెళ్ళారు...