Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

Advertiesment
Cockroach In Ragi Sangati

ఠాగూర్

, మంగళవారం, 7 అక్టోబరు 2025 (10:21 IST)
హైదరాదాద్ నగరంలోని పేరొంది రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పూర్తిగా అడుగంటి పోయాయి. ఫలితంగా ఇవి మరోమారు చర్చనీయాంశంగా మారాయి. భాగ్యనగరిలో రుచికరమైన వంటకాలకు పేరుగాంచిన కృతుంగ రెస్టారెంట్‌లో ఓ వినియోగదారుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నానక్‌రామ్‌గూడ శాఖలో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన రాగి సంగటిలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో హైదరాబాద్‌లోని ఆహార ప్రియులు మరోసారి ఉలిక్కిపడ్డారు.
 
సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ కస్టమర్ ఈ రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లారు. అక్కడ రాగి సంగటి ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత అందులో బొద్దింక ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితుడు ఆరోపించాడు. దీంతో అతడు యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేసి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. 
 
రాగి సంగటిలో బొద్దింక ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కృతుంగ వంటి పేరున్న రెస్టారెంట్‌లో ఇలాంటి ఘటన జరగడంపై ఆ రెస్టారెంట్ రెగ్యులర్ కస్టమర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని హోటళ్లలో పరిశుభ్రతపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబరు 11న ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బ్యాంగ్ దీపావళి - భారీగా ఆఫర్లు