Chiranjeevi and Venkatesh
80వ దశకంలోని నటీనటులు అంతా కలిసి ఒకరోజు కలిసి తమ ఆనందాన్ని తన పార్టీలో పంచుకుంటుంటారు. గతంలో హైదరాబాద్ లో ఖుష్బూ, రాధిక, రాధ తదితరులంతా కలిసి కిట్టీ పార్టీలో పాల్గొన్నారు. ఇలా ప్రతి ఏడాది ఇలా ఏదో ఒక చోట కలిసి రీయూనియన్ గా తమలోని ఎనర్జీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈసారి 80ల నాటి పునఃకలయిక చెన్నైలో జరగనుంది.
నేడు చెన్నై ప్రత్యేక జెట్ లో చిరంజీవి, వెంకటేష్ తమ ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరూ మన శంకర్ ప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సాయంత్రం 80ల నాటి తారలు కలిసి రావడంతో కలకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాల వేడుకగా ఉంటుంది. కళ్ళకు రకరకాల గంతలు కట్టుకుని పార్టీలో పాల్గొంటారు..