అత్యంత విషమంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆరోగ్యం...

ఠాగూర్
ఆదివారం, 30 నవంబరు 2025 (12:58 IST)
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలీదా జియా ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం ఆ దేశ రాజధాని ఢాకాలోని ఓ ఆస్పత్రి ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. 80 యేళ్ల ఖలీదా జియాకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లక్షణాలతో ఈ నెల 23వ తేదీన ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. 
 
దీనిపై బీఎన్పీ సీనియర్ నేత అహ్మద్ అజం ఖాన్ ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఖలీదా జియా ఐసీయూలో ఉన్నారు. వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది అని తెలిపారు. ఆమె ఆరోగ్యం కాస్త స్థిరపడితే, మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించేందుకు ఎయిర్ అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచినట్టు ఆయన వివరించారు. మరోవైపు, ఈ వార్త తెలియగానే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. 
 
ఖలీదా జియా చాలా కాలంగా గుండె, కాలేయం, కిడ్నీ సమస్యలతోపాటు డయాబెటీస్, ఊపిరితిత్తుల వ్యాధులు, అర్థరైటిస్ వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆమెకు శ్వాస పేస్‌మేకర్‌ను అమర్చారు. 
 
కాగా, లండన్‌లో ఉంటున్న ఆమె పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్ తన తల్లి త్వరగా కోలుకోవాలని బంగ్లాదేశ్ ప్రజలు ప్రార్థించాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను స్వదేశానికి రాలేకపోతున్నానని, ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 
 
కాగా, గత 2018లో అవినీతి ఆరోపణలపై ఖలీదా జియా జైలుకు వెళ్లారు. అపుడు ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఉండేది. అయితే, గత యేడాది హసీనా ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే తాను అనారోగ్యంగా ఉన్నప్పటికీ వచ్చే యేడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఖలీదా జియా ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఇంతలోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments