Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త సైన్యంలో-భార్య ప్రియుడితో చాటింగ్.. అత్త వార్నింగ్.. పాము కాటుకు?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (14:45 IST)
వివాహేతర సంబంధానికి అడ్డున్న భర్తలనే కొందరు మహిళలు హతమార్చుతున్న సంఘటనలు పోయి.. ప్రస్తుతం తన అక్రమ సంబంధానికి అడ్డుగా వుందనే కారణంగా అత్తను తెలివిగా తొలగించుకోవాలనుంది కోడలు. ఆ తెలివి తేటల కారణంగా అత్తను హత్య చేసింది. కానీ ఆ కోడలు ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతోంది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అల్పన, సచిన్ భార్యభర్తలు. సచిన్ సైన్యంలో పనిచేస్తుండడంతో అల్పన.. అత్త సుబోధ్ దేవితో కలిసి ఉంటోంది. సుబోధ్ దేవి భర్త రాజేశ్ ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారు.
 
ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన మనీష్ అనే వ్యక్తితో అల్పనకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్‌లు మితిమీరడంతో గమనించిన సుబోధ్ దేవి కోడల్ని మందలించింది. దీంతో అత్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది కోడలు. ప్రియుడు మనీష్‌తో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా పాముతో కాటు వేయించి అత్తను హత్య చేసింది. గతేడాది జూన్ 2న ఈ ఘటన జరిగింది.
 
సుబోధ్ దేవి మరణించిన నెలన్నర తర్వాత అల్పన ప్రవర్తనను చూసి సుబోధ్ దేవి బంధువులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టి.. నిందితురాలు అల్పనను అరెస్ట్ చేశారు. ఆపై అల్పన, మనీష్, కృష్ణ కుమార్‌లను రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments