హలో బ్రదర్... నేను చంద్రబాబు నాయుడిని... ఓ మహిళకు అండగా...

మంగళవారం, 7 జనవరి 2020 (12:34 IST)
తన భర్త అనుమతి లేకుండా రైతు దీక్షకు భర్తకు చెప్పకుండా వచ్చిన ఓ మహిళకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండగా నిలబడ్డారు. ఆ మహిళ భర్తకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. హలో బ్రదర్.. నేను చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నారు. మీ భార్య నాగలక్ష్మి రైతు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. అదీ కూడా మీకు చెప్పకుండా వచ్చారు. అందువల్ల ఆమెను ఏమీ అనొద్దు అంటూ కోరారు. 
 
ఈ ఆసక్తికర సన్నివేశం వివరాలను పరిశీలిస్తే, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న రైతులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతు తెలుపుతూ టీడీపీ నేత గద్దె రామ్మోహన్ నిరసన దీక్షకు దిగారు. ఆ దీక్షకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ నిరసనకు నాగలక్ష్మి అనే మహిళ కూడా వచ్చింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ఇంట్లో భర్తకు చెప్పకుండా దీక్షకు వచ్చానని, ఆయన పేరు చంద్రశేఖర్ అని, ఆఫీసుకు వెళ్లారని చెబుతూ, తన భర్తకు మీరే సర్ది చెప్పాలని కోరింది. ఆ వెంటనే స్పందించిన చంద్రబాబు, ఫోన్ నంబర్ రాసివ్వాలని కోరి, వెంటనే చంద్రశేఖర్‌కు ఫోన్ చేశారు. 
 
'హలో బ్రదర్... నేను చంద్రబాబునాయుడిని అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక్కడ ఓ మీటింగ్‌కు నాగలక్ష్మి వచ్చారని, మీ పర్మిషన్ లేకుండా వచ్చారని, దీక్షకు సంఘీభావాన్ని తెలిపారని అన్నారు. ఇంతవరకూ తాను భర్త అనుమతి లేకుండా ఎన్నడూ గడప దాటింది లేమని, మొదటిసారి ఎమోషన్‌లో వచ్చారని, ఓ ఉంగరాన్ని ఉద్యమానికి ఇచ్చారని, మనస్ఫూర్తిగా ఆమెను ఆశీర్వదించి, సహకరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వైకాపా నేతల ఒత్తిడి తట్టుకోలేనంటూ గ్రామ సచివాలయ ఉద్యోగిని సూసైడ్