Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వర్గాన్ని చూపిస్తా రమ్మని పిలిచి నరకాన్ని చూపించింది... ఏం జరిగింది?

Advertiesment
స్వర్గాన్ని చూపిస్తా రమ్మని పిలిచి నరకాన్ని చూపించింది... ఏం జరిగింది?
, బుధవారం, 8 జనవరి 2020 (15:21 IST)
ఇరాక్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ యేడాది ఏప్రిల్ నెలలో వ్యాపార పనుల కోసం షార్జా వెళ్ళాడు. అక్కడ అతినికి స్వీడిష్ విద్యార్థినంటూ ఓ మహిళ ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పరచుకుంది. కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య చనువు పెరగడంతో పర్సనల్‌గా కలుద్దామని అతడికి ఆ మహిళ ఆఫర్ ఇచ్చింది. దీంతో దుబాయ్‌లో ఆమెను కలిసి అక్కడి నుంచి షార్జా వెళదామని ప్లాన్ చేసుకున్న వ్యాపారవేత్త ఇరాక్ నుంచి భారీగా నగదు తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు.
 
ఇరాక్‌కు చెందిన వ్యాపారవేత్తను రొమాన్స్ పేరుతో ఆకర్షించిన ఓ మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి అతడిని దోచుకుంది. కొద్దిరోజుల పాటు అతడితో చాట్ చేసిన మహిళ తన ఫ్లాట్‌లో ఎవరూ లేరని.. నువ్వు వస్తే స్వర్గాన్ని చూపిస్తానంటూ ఊరించే మాటలు చెప్పింది. దీంతో అతను ఎంతో ఆశతో అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడ ఐదుగురు నైజీరియన్స్‌ను వెంటబెట్టుకుని అతనికి చుక్కలు చూపించారు.
 
ఫ్లాట్ లోకి వెళ్ళగానే ఐదుగురు ఆఫ్రికన్స్ మహిళలలు కనిపించడంతో ఉత్సాహంగా వచ్చిన వ్యాపారవేత్త నీరుగారిపోయాడు. వారంతా అతన్ని చితకబాది ఓ గదిలో బంధించారు. తనకు శ్వాస సంబంధిత వ్యాధి ఉందని.. విడిచి పెట్టాలని కోరగా వారు అతడికి విముక్తి కలిగించారు. 
 
క్యాబ్‌కు డబ్బులు లేవని చెప్పడంతో ఓ మహిళ 600 దిర్హామ్స్ ఇచ్చింది. దీంతో అతను నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫ్లాట్ దగ్గరికి వచ్చే లోపు ఇద్దరు మాత్రమే నైజీరియన్లు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేఎన్‌యూ విద్యార్థులపై దాడి : యువతరాన్ని భారత్ దెబ్బతీస్తోందా?