భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

ఠాగూర్
శుక్రవారం, 25 జులై 2025 (21:49 IST)
భార్య విడాకులు ఇచ్చిందని ఓ భర్త అన్నపానీయాలు మానేసి ఏకంగా వంద బీర్లు తాగిన ఘటన ఒకటి చోటుచేసుకుంది. భార్య విడాకులు ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక వ్యక్తి నెల రోజుల పాటు ఆహారం తీసుకోకుండా కేవలం బీర్లు మాత్రమే తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన థాయ్‌లాండ్‌‌లో చోటుచేసుకుంది. 
 
44 యేళ్ల థవీసక్‌కు అతని భార్య విడాకులు ఇచ్చింది. వారికి 16 యేళ్ల కుమారుడు ఉన్నాడు. కుమారుడిని థవీసక్ వద్దే ఉంచి ఆమె వెళ్లిపోయింది. భార్య తనను వదిలి వెళ్లడంతో తీవ్ర వేదనకు గురైన థవీసక్ ఆహారం తీసుకోవడం పూర్తి మానేశాడు. రోజంతా బీర్లు తాగుతూ గడిపాడు. 
 
దీంతో అతని శరీరంలోని అవయవాలు సరిగా పని చేయకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఒక స్వచ్ఛంధ సంస్థ థవీసక్‌ను ఆస్పత్రిలో చేర్పించాలని ప్రయత్నించింది. 
 
అయితే, స్వచ్ఛంధ సంస్థ సభ్యులు అతని ఇంటికి చేరుకునేలోపే థవీసక్ మరణించాడు. విచారణ జరిపిన అధికారులు అతని గదిలో 100 బీరు సీసాలను గుర్తించారు. అధిక మొత్తంలో మద్యం సేవించడం వల్లే అతని మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments