Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

Advertiesment
romance

ఠాగూర్

, శుక్రవారం, 25 జులై 2025 (12:55 IST)
యువతీయువకులు లైంగిక సమస్మతి కోసం వారి వయసును తగ్గింపు సబబు కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బాల్య వివాహాలు, మైనర్లపై లైంగిక దాడుల నుంచి రక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోరాదని కోరింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం వివరించింది. ప్రత్యేక సందర్భాలలో 'కేస్ బై కేస్' మినహాయింపులు ఇవ్వడం సముచితమని పేర్కొంది. ఈ వయసు తగ్గించడం వల్ల చిన్నారులను లైంగిక దోపిడీ నుంచి రక్షించేందుకు తీసుకొచ్చిన లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ ('ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో) చట్టం ఉద్దేశం దెబ్బతింటుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వయసు 18 ఏళ్లను అలాగే కొనసాగించాలని సూచించింది.
 
చిన్నారులపై లైంగిక నేరాలు ఎక్కువగా వారితో నిత్యం సన్నిహితంగా ఉండే వారి వల్లే జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. పిల్లల చుట్టూ ఉండే వారి నమ్మకస్తులే ఎక్కువగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు వారు, టీచర్లు వంటి వారివల్ల లైంగిక దోపిడీకి గురైన చిన్నారులు తమపై జరిగిన అఘాయిత్యం ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదనకు గురవుతారని వివరించింది. ఈ క్రమంలో లైంగిక సమ్మతి వయసు తగ్గించడం వల్ల చిన్నారులకు రక్షణ లేకుండా చేయడమేనని, ఈ దారుణాలకు దారులు తెరవడమేనని వాదించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు