Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

Advertiesment
doctor legs

ఠాగూర్

, శుక్రవారం, 25 జులై 2025 (11:23 IST)
బ్రిటన్‌కు చెందిన ఓ వైద్యుడు తన రెండు కాళ్లను తొలగించుకున్నారు. బీమా సొమ్ముకు ఆశపడి ఈ పనికి పాల్పడ్డారు. రూ.5 లక్షల పౌండ్లు వస్తాయన్న ఆశతో ఆయన మోకాళ్ల కింది భాగాన్ని తొలగించుకున్నారు. ఈ మొత్తం సొమ్ము భారతీయ కరెన్సీలో రూ.5.4 కోట్లు. దీనిపై బీమా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.
 
నెయిల్ హావర్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే తన రెండు మోకాళ్లను తొలగించుకున్నాడని బీమా సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. బీమా డబ్బుల కోసం ఇతరుల కాళ్లను కూడా తొలగించేలా మారియస్ గుత్సావ్సన్ అనే వైద్యుడిని నెయిల్ ప్రోత్సహించారనే అభియోగాలు వచ్చాయి. దీంతో అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
శరీరానికి హాని కలగకుండా మోకాళ్లను ఎలా తొలగించుకోవచ్చనే దానిపై నెయిల్ ఒక వెబ్‌సైట్ నుంచి కొన్ని వీడియోలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటి ఆధారంగా మరో వైద్యుడి సహకారంతో తన రెండు కాళ్లను తొలగించుకున్నాడు. ఆ తర్వాత బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
 
తనకు రక్తనాళాల సమస్య ఉందని, మోకాళ్లను తొలగించుకోకపోతే అది శరీరమంతా వ్యాపిస్తుందని బీమా సంస్థలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ముందుగా సమాచారం ఇవ్వలేదనే కారణంతో బీమా సంస్థలు అతని క్లెయిమ్‌సను తిరస్కరించాయి. అదే సమయంలో మారియస్ గుత్సావ్సన్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు నెయిల్‌ను అరెస్టు చేశారు.
 
అయితే, ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియాతో నెయిల్ మాట్లాడుతూ, తన అనారోగ్యం కారణంగానే కాళ్లు తొలగించుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపాడు. కాళ్లు ఉన్నప్పటి కంటే కోల్పోయిన తర్వాతనే తన జీవితం బాగుందని ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?