Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

Advertiesment
manipur violance

ఠాగూర్

, శుక్రవారం, 25 జులై 2025 (10:34 IST)
ఈశాన్య రాష్ట్ర భారత రాష్ట్రమైన మణిపూర్‌లో అమలవుతున్న రాష్ట్రపతి పాలనును కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలో పాటు పొడగించింది. ఇది ఆగస్టు 13వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో వచ్చే యేడాది ఫిబ్రవరి 13వ తేదీ వరకు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రపతి పాలనను పొడగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పార్లమెంట్‍‌లో తీర్మానం ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. 
 
కాగా, 2023 మే నెల నుంచి తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్ అట్టుడికిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ నేపత్యంలో 2025 ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కేంద్రం అదే రోజు అక్కడ రాజ్యంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపత పాలన విధించింది. 
 
అయితే, ఆ రాష్ట్ర ప్రస్తుత శాసన సభ కాలపరిమితి 2027తో ముగియనుంది. కాగా, రాష్ట్రంలో గత 21 నెలలుగా కొనసాగుతున్నట్టు అల్లర్లు, హింస కారణంగా దాదాపు 250 మందికి పైగా మృతి చెందగా 60 వేలకు పైగా ప్రజలు తమ గృహాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక