Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపూర్ : ఇద్దరు జవాన్లను కాల్చి తనను తాను కాల్చుకున్న జవాను

Advertiesment
firing

ఠాగూర్

, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (09:55 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు సొంత క్యాంపులోని ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. వ్యక్తిగత వివాదం కారణంగా ఈ ఘటన జరిగివుండొచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అసలు కారణం మాత్రం తెలియాల్సివుంది. 
 
మణిపూర్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన సాగుతుంది. దీనిపై మణిపూర్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తూ, ఇదొక దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని మణిపూర్ పోలీసులు తెలిపారు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని లామ్‌సంగ్ సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఈ ఘటన జరిగిందన్నారు. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
కాగా, గత రెండు మూడు సంవత్సరాలుగా మణిపూర్‌ రెండు జాతుల తెగలకు చెందిన ప్రజల మధ్య జరుగుతున్న ఘర్షణలతో అట్టుకుపోతుంది. ఈ నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంతమ్రి బీరేన్ సింగ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గురువారం నుంచి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో రాష్ట్రంలో భద్రతను కుట్టుదిట్టం చేయడంతో పాటు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కంగల్ పోర్ట్ వెలుపల ఆర్మీ బలగాలను భారీ సంఖ్యలో మొహరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకు పడవలో విహరిస్తుంటే తండ్రి వీడియో తీస్తున్నాడు.. ఇంతలో తిమింగలం వచ్చి... వామ్మో (Video)