Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

Advertiesment
Manipur

సెల్వి

, గురువారం, 15 మే 2025 (08:44 IST)
Manipur
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం పది మంది మిలిటెంట్లు మరణించారని భారత సైన్యం తెలిపింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. "ఇండో-మయన్మార్ సరిహద్దు సమీపంలోని చందేల్ జిల్లా ఖెంగ్‌జోయ్ తహసీల్, న్యూ సమతాల్ గ్రామం సమీపంలో సాయుధ కేడర్ల కదలికలపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ 2025 మే 14న ఆపరేషన్ ప్రారంభించింది" అని ఆర్మీ కమాండ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉండగా, మణిపుర్​లోని ఉఖ్రుల్​ జిల్లాలో వచ్చే వారం నుంచి ఐదు రోజుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా కుకీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి మైతేయిలు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ హెచ్చరికను తంగ్ఖుల్​ నాగ సామాజిక కార్యకర్త అసంగ్ కాషర్ ఖండించారు. ఇది మణిపుర్‌లోని ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా ఒక సవాలు అని, దీనివల్ల వారు (కుకీలు) శాంతికి వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు.
 
మరోవైపు, మణిపుర్​లో జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. మే 2023 నుంచి జరిగిన జాతి ఘర్షణల వల్ల దాదాపు 260మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు