Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్మా, ఉ కొరియా అణు కార్యక్రమాలపై ఆందోళన

Webdunia
ఉత్తర కొరియా, బర్మా వివాదాస్పద అణు కార్యక్రమాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కాలం బర్మా కూడా అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అణు కార్యక్రమానికి ఉత్తర కొరియా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాబర్ట్ వుడ్ మాట్లాడుతూ.. ఇటువంటి వార్తలు సహజంగానే తమను ఆందోళన పరుస్తాయని చెప్పారు. ఉత్తర కొరియా, బర్మా మిలిటరీ సంబంధాలపై ఇప్పటికే అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా సాయంతో బర్మా అణ్వాయుధాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోందని వార్తలు వస్తుండటం అమెరికాను కలవరపెడుతుందన్నారు.

ఇటీవల థాయ్‌లాండ్ పర్యటనలో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారని వుడ్ పేర్కొన్నారు. బర్మా, ఉత్తర కొరియా వివాదాస్పద అణు కార్యక్రమాలపై అమెరికా ఇటీవల కాలంలో తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments