Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

Advertiesment
Tiruveer, Aishwarya Rajesh

దేవి

, బుధవారం, 3 డిశెంబరు 2025 (18:20 IST)
Tiruveer, Aishwarya Rajesh
హీరో తిరువీర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది.
 
ఈరోజు మేకర్స్ ఈ చిత్రం టైటిల్ 'ఓ.! సుకుమారి'ని రివిల్ చేశారు. ఆకట్టుకునే పోస్టర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. ఇందులో నీలిరంగు హృదయ చిహ్నాన్ని ఒక అద్భుతమైన నారింజ రంగు మెరుపుతో డివైడ్ చేశారు. గ్రామ ప్రజలు పరిగెడుతూ కనిపంచడం కథలోని ఊహించని మలుపులను సూచిస్తుంది.
 
 ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం సినిమాకి పని చేస్తోంది. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తారాగణం: తిరువీర్, ఐశ్వర్య రాజేష్, ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్