Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Advertiesment
Virat krishna - Nagabandam

దేవి

, బుధవారం, 3 డిశెంబరు 2025 (17:52 IST)
Virat krishna - Nagabandam
హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యసీవ్ సినిమాటిక్ వండర్ గా రూపొందుతోంది.
 
ప్రస్తుతం టీం నానక్‌రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్‌ పుట్టించే క్లైమాక్స్‌ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
 
ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ తన బృందంతో కలిసి సెట్లోని ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించి, కథనం స్థాయిని మరింతగా పెంచేలా కేర్ తీసుకున్నారు.
 
అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్  సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్‌గా మైండ్ బ్లోయింగ్ గా వుండబోతోంది.
 
నాగబంధంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
సినిమా కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుంది. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న “నాగబంధం” అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ, పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో వుంటుంది.  
 
ఈ చిత్రానికి సౌందర్ రాజన్ S  సినిమాటోగ్రఫీ,  ఆర్ సి ప్రణవ్ ఎడిటర్.
 
నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.  
 
నాగబంధం టీమ్ త్వరలోనే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన టీజర్లు, షూటింగ్‌లోని విశేషాలు, అభిమానులను ఆకట్టుకునే ఇంటరాక్టివ్ కార్యక్రమాలతో అలరించబోతోంది.
 
అభిషేక్ నామా క్రియేటివ్ విజన్, అద్భుతమైన నటీనటుల, టెక్నికల్ టీంతో రూపొందుతున్న నాగబంధం మైల్ స్టోన్ గా నిలవనుంది,

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి