Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Advertiesment
Nikhil - Swayambhu

దేవీ

, సోమవారం, 24 నవంబరు 2025 (17:58 IST)
Nikhil - Swayambhu
పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో  ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది.
 
ఈ రోజు మేకర్స్ భారీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు. రెండు సంవత్సరాల ప్రయాణం,170 రోజుల ఇంటెన్స్ షూటింగ్ తర్వాత ఈ మహత్తర చిత్రీకరణ పూర్తి చేసిందని టీం గర్వంగా ప్రకటించింది. భారతదేశపు వైభవమైన చరిత్రను, మహోన్నతతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
చిత్రం మీద పనిచేయడం సవాలుతో కూడుకున్నా అద్భుతమైన అనుభవం అని 'Rise of Swayambhu' వీడియో షేర్ చేశారు నిఖిల్. ''ఒక్క సినిమా.. రెండు సంవత్సరాల కష్టం.. పదుల సంఖ్యలో సెట్లు. వేల సవాళ్లు.. అదొక సామ్రాజ్యం. లక్షల మంది ప్రేక్షకులు. కోట్ల పెట్టుబడి.. మా నిర్మాతలో భువన్ శ్రీకర్ల నమ్మకం. ఇదే మా స్వయంభు.
 
'మన భారత దేశ చరిత్రకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవి  రాజుల కథలో యుద్ధ గాథలో కాదు. మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఒక గొప్ప వీరుడి కథే ఈ స్వయంభు'  
 
వీడియోలో నిఖిల్ తన గుర్రం మారుతి ని పరిచయం చేస్తూ, ఈ మాగ్నమ్ ఓపస్‌ను సాకారం చేసిన టెక్నీషియన్‌ బృందాన్ని అభినందించారు.
 
ఈ పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్  ట్రైనింగ్ తీసుకున్నారు. కథనానికి ప్రామాణికతను ఇవ్వడానికి హిందీ వెర్షన్‌కూ ఆయన స్వయంగా డబ్బింగ్‌ చెప్పారు.
 
ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విజువల్ మాస్ట్రో కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, స్టార్ కంపోజర్  రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను ఎం. ప్రభాహరన్, రవీంద్ర వహిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్