Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంగీత్‌ చిత్రం నుండి యూట్యూబర్ నిఖిల్‌ విజయేంద్ర సింహా గ్లింప్స్

Advertiesment
Nikhil Vijayendra

దేవీ

, శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (17:06 IST)
Nikhil Vijayendra
ప్రముఖ యూట్యూబర్ నిఖిల్‌ విజయేంద్ర సింహా నటుడిగా సంగీత్‌ చిత్రం నుండి నేడు నిర్మాతలు ఓ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌ ఆకట్టుకునేలా ఉంది. సంగీత్ అనేది తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ చిత్రానికి సాద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన 'హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్' అనే కల్ట్ పొలిటికల్ సెటైర్‌ను రూపొందించారు.

లహరి ఫిల్మ్స్, ఆర్.బి. స్టూడియోస్ పతకాలపై నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాద్ ఖాన్ తో పాటు సిద్ధాంత్ సుందర్ రచయితగా వ్యవహరిస్తుండగా, కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు. 
 
'సంగీత్‌' చిత్రం నుండి విడుదలైన పుట్టినరోజు గ్లింప్స్, నటుడిగా నిఖిల్‌ విజయేంద్ర సింహా యొక్క అనేక కోణాలను హైలైట్ చేస్తుంది. అలాగే, ప్రేక్షకులను 'సంగీత్‌' ప్రపంచంలోకి తీసుకొని వెళ్తుంది. వైవిధ్యమైన కథాంశం, అద్భుతమైన విజువల్స్ తో సినీ అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్.. సామాజిక మాధ్యమాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. త్వరలో నిర్మాతలు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. 'సంగీత్‌' చిత్రం యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. చిత్రం: సంగీత్‌ కథానాయకుడు: నిఖిల్‌ విజయేంద్ర సింహా రచన: సాద్ ఖాన్, సిద్ధాంత్ సుందర్ దర్శకత్వం: సాద్ ఖాన్ నిర్మాతలు: నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ నిర్మాణ సంస్థలు: లహరి ఫిల్మ్స్, ఆర్.బి. స్టూడియోస్ పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Beauty Review: ఎమోషన్స్ సరిగ్గా పండించలేని బ్యూటీ చిత్రం - బ్యూటీ రివ్యూ