Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shilpa: సుధీర్ బాబు జటాధర నుంచి తాంత్రిక పూజ చేస్తున్న శిల్పా శిరోద్కర్‌ లుక్

Advertiesment
Shilpa Shirodkar's look from Jatadhara

దేవీ

, శుక్రవారం, 29 ఆగస్టు 2025 (12:12 IST)
Shilpa Shirodkar's look from Jatadhara
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. ఇటివల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది.  
 
మూవీ మేకర్స్ ఒక కీలకమైన కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. శోభగా శిల్పా శిరోద్కర్‌ ని పరిచయం చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఆమె బ్లాక్ చీర కట్టుకుని, హోమగుండం ముందు కూర్చొని కనిపించారు. ఆ పోస్టర్ మొత్తం మిస్టికల్ ఎనర్జీతో తాంత్రిక శక్తులని సింబలైజ్ చేస్తోంది. శిరోద్కర్‌ ఇచ్చిన ఇంటెన్స్, సీరియస్ ప్రెజెన్స్ సినిమా సూపర్‌నాచురల్, స్పిరిచువల్ టోన్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయింది.
 
జీ స్టూడియోస్‌, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా  ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో., క్రియేటివ్ డైరెక్షన్‌ దివ్య విజయ్‌. జీ స్టూడియోస్‌ స్ట్రాటజిక్ విజనరీ ఉమేష్ కుమార్ బన్సాల్ మద్దతుతో, ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుుణ అగర్వాల్, శిల్ప సింగాల్, కో-ప్రొడ్యూసర్స్ అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా ఈ ప్రాజెక్ట్‌ కు మద్దత్తు ఇస్తున్నారు. టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్, పరి వంటి హిట్స్ ఇచ్చిన ప్రెర్ణా అరోరా మళ్లీ  హై-కాన్సెప్ట్ సినిమాను రూపొందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Barbaric Review: మారుతి సమర్పించిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ