తెలుగు వెండితెరపై దేవుడికి, తుపానుగా,సినిమా ప్రపంచంలో శాశ్వతమైన ప్రభావితాన్ని చూపించిన శక్తిగా లెజెండీ యాక్టర్ సూపర్‌స్టార్ కృష్ణను సుధీర్ బాబు నటిస్తున్న జటాధర చిత్రయూనిట్ స్మరించుకుంది. తమ కథలను ఈ ప్రపంచానికి అందించటానికి కృషి చేస్తోన్న ఈ జట్టుకు ఆయన చూపిన దారి మార్గదర్శకత్వంగా నిలుస్తోంది. హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చర్మిష్మా అంటూ సినీ పరిశ్రమపై ఆ లెజెండ్రీ నటుడి చిరస్మరణీయ ప్రభావాన్ని మే31న శ్లాఘించింది.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న జటాధర సినిమా షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.ఈ చిత్రం నటీనటులు, టెక్నీషియన్స్ సినీ ప్రయాణంలో మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోనుంది అంటూ చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఇండియా మూవీగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ జటాధరను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సి నటిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలుగా, దివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భవానీ గోస్వామి సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా జటాధర సినిమా తెరకెక్కుతోంది.
చిత్రీకరణను పూర్తి చేసుకున్న జటాధర చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది. అభిమానులు, ప్రేక్షకులకు ఈ సినిమా ఓ గొప్ప అనుభూతినిచ్చేలా రూపొందుతోంది.